telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోహ్లీ, గంగూలీ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు…

మద్రాస్ హైకోర్టు పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీచేసింది. గ్యాంబ్లింగ్ కు సంబంధించిన అనుకూల ప్రకటనల్లో నటించిన సెలబ్రెటీలకు నోటీసులు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. అయితే ఈ రోజు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ పై మద్రాస్‌ హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిల్‌ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సినీ నటులు తమన్నా, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రాణా, సుదీప్‌లకు నోటీసులు పంపించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని ఈ పిల్‌ లో పేర్కొన్నారు. నవంబర్ 19లోగా తమకు సమాధానమివ్వాలని వారందరికి ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరందరూ మొబైల్ ప్రీమియర్ లీగ్(ఎంపిఎల్) అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకముందు కోహ్లీ, తమన్నాను అరెస్ట్ చేయాలనీ మద్రాస్ హైకోర్టులో సూర్యప్రకాష్ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ ఇద్దరు సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ బెట్టింగులకు సంబంధించిన యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది యువకులు ఈ తప్పుడు దారిలోకి వెళ్తున్నారని సంబంధిత న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Related posts