telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ పక్కన సీతగా కీర్తి సురేష్…

Keerthy

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్‌లోనే ఉన్నాయి. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారిప్పుడు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.ఈ చిత్రం హీరోయిన్ విషయమై గత రెండు మూడు రోజులుగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మహానటి ఫేం కీర్తి సురేష్ ను ప్రభాస్ కు జోడీగా ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రభాస్ రాముడిగా కీర్తి సురేష్ సీతగా కనిపించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ కారణంగానే ఈమెను ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకు తీసుకుంటే బాగుంటుందనే నిర్ణయంలో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ మహేశా బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమాలో ఎవరు సీతగా సానిపిస్తారు అనేది.

Related posts