telugu navyamedia
సినిమా వార్తలు

ఏం చరణ్​.. నన్ను డామినేట్​ చేస్తావా? నీ బాబును రా నేను’

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ తేజ్​ నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరుకు జ‌త‌గా కాజ‌ల్ న‌టిస్తుండ‌గా..రామ్‌చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న‌ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

ఏప్రిల్‌ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్‌ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌. తాజాగా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్ ను ఈ నెల 18న విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు.

Acharya Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

ఇదిలా ఉంటే ఈ పాటకి సంబంధించి ముందస్తు చర్చల వీడియోని పంచుకుంది యూనిట్‌. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు కొరటాల శివ ఉన్నారు. `భలే భలే బంజారా` సాంగ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌తో స్టెప్పులేయించబోతున్నట్టు తెలిపారు కొరటాల శివ. అయితే ఇటీవల `నాటు నాటు` పాటతో చరణ్‌ ఇరగ్కొట్టాడు. ఆయనతో నేను పోటీ పడగలనా అని చిరంజీవి టెన్షన్‌ పడుతున్నట్టు కనిపించారు.

Buzz: Bollywood star hero to promote Chiranjeevi's Acharya | 123telugu.com

ఈ వీడియోలో చిరంజీవి, రామ్​చరణ్​, దర్శకుడు కొరటాల శివ మాట్లాడుకుంటూ కనిపించారు. సార్‌ ఏంటి సార్ సాంగ్‌ పరిస్థితి అని కొరటాల అడగ్గా..‘రేపు నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. మీ సాంగ్‌ చాలా బాగుంది. మణి(మణిశర్మ) ఏమో థియేటర్లలో ఊగదంపుడు, కొట్టి అవతల పడేశాడు. రేపు మాత్రం మేము సెట్స్‌లో ఎలా చేయాలో అనే టెన్షన్‌ నాకుంది’అని చిరంజీవి అన్నారు.

Acharya POSTPONED again; Chiranjeevi & Ram Charan starrer gets a new  release date | PINKVILLA

మీరే అలా అంటే ఎలా సర్‌ అని కొరటాల అనగా.. ‘మాములుగా అయితే అలా అనను. రేపు పొద్దున చరణ్‌తో ఎట్లాని ఆలోచిస్తున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘నాటు నాటు’పాటకు తారక్‌, చరణ్‌ అదగొట్టేశారు. ఇప్పుడు ఆ అంచనాలను అందుకోవాలంటే..కాస్త టెన్షన్‌గా ఉంది’ అని చిరంజీవి అంటారు.

చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. మేం ఎంత నాటుగా చేసిన ఆయన(చిరంజీవి)వచ్చి ఆయన గ్రేస్‌తో, ఎక్స్‌ప్రెషన్‌తో మ‌మ్మ‌ల్ని ప‌క్క‌న పెడ‌తార‌ని అని నా డౌట్‌’అని చరణ్‌ అన్నాడు.

Acharya Movie: Bhale Bhale Banjara Song Release Date Out - Sakshi

ఇక చివరల్లో ఇద్దరు చిరంజీవి..‘హేయ్‌ చరణ్‌.. ఏంటి సాంగ్‌ని డామినేట్‌ చేద్దామని చూస్తున్నావా? నీ బాబుని రా నేను’అని చిరు అంటే..లేదు డాడీ.. డామినేట్‌ చేయను..బట్‌ తగ్గను’అన్నాను.

`తగ్గాలి తగ్గుతావ్‌.. అంటారు చిరు..దీనికి చరణ్‌ రియాక్ట్ అవుతూ `తగ్గాలి కాదు డాడీ.. తగ్గను అంటున్నా, నీ ట్రైనింగ్‌ నుంచి వచ్చాను. తగ్గితే బాగుండదు కదా` అని తెలిపారు.

20 to 25 minutes News | Latest News on 20 to 25 minutes - Times of India

ఇక్కడ కాదు సెట్‌లో చూసుకుందాం’అని చిరంజీవి సవాల్‌ విసిరి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. తండ్రి కొడుకులు కలిసి స్టెప్పులేసే ఈ పాట ఏప్రిల్‌ 18న విడుదల కానుంది.

Related posts