telugu navyamedia
సినిమా వార్తలు

కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వ‌చ్చేసింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఆర్ఆర్’ . ఇటీవలే విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులోరాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అల్లూరి, కొమరం భీం పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నెమ్మదిగా ఒక్కో వీడియో సాంగ్ రిలీజ్ చేస్తోంది. ఇటీవలే నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా ‘కొమ్మా ఉయ్యాల’ ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది చిత్ర‌యూనిట్‌.

RRR లో "కొమ్మ ఉయ్యాలా" పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా..? ఆమెకి ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ సాంగ్ తోనే మొదలవుతుంది. అందరినీ హత్తుకునేలా పాట పాడుతూ బ్రిటీష్‌ దొరసాని చేతికి డిజైన్‌ వేస్తుంటుంది మల్లి. ఆమె టాలెంట్‌కు మంత్రముగ్ధురాలైన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా లాక్కుని పోవడంతో సినిమా ప్రారంభమవుతుంది.

RRR makers to release 'Komma Uyyala' video song on SATURDAY

ఇందులో మల్లిని ఎత్తుకుపోయే దగ్గర నుంచి ఆమె బందీ అయిన క్షణాలు, ఎన్టీఆర్‌ ఆమెను భుజానెక్కించుకుని తిరిగిన సందర్భాలను చూపించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి అద్భుతంగా ఆలపించింది.సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

Komma Uyyala Song Lyrics in Telugu & English - RRR Movie Song - TeluguTracks

ఆదిలాబాద్ ఆదివాసీల జీవనాన్ని ప్రతిబింబించేలా రాజమౌళి ఈ పాటని తెరకెక్కించారు.బ్రిటిష్ చెర నుంచి కొమరం భీం ఆ పాపని విడిపించుకుని తమ గిరిజన తండాకు ఎంటర్ అయ్యే దృశ్యాలు చాలా బావుంటాయి. ఎన్టీఆర్ అసలైన కొమరం భీం గెటప్ లో అద్భుతంగా ఉన్నాడు.

Related posts