telugu navyamedia
సినిమా వార్తలు

‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. గ్రామీణ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రాజ‌మండ్రి పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం. భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసి సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని.. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు మంచి పేరు రావాల‌ని, నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డికి సినిమా అన్ని ర‌కాలుగా పెద్ద స‌క్సెస్ కావాల‌ని అభినంద‌న‌లు తెలిపారు.

సినిమా విషయానికి వస్తే… ‘భానుమ‌తి రెడ్డి’ గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న ల‌వ్‌స్టోరీ. ప్రేమ‌క‌థలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాల‌తో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు.

నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు మాట్లాడుతూ ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ తో సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు.

Related posts