telugu navyamedia
సినిమా వార్తలు

“సర్కస్ కార్-2” హీరోయిన్‌గా హాట్ బ్యూటీ తేజస్వి

నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కస్ కార్ 2’. మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ రూపొందుతున్న “సర్కస్ కార్-2” చిత్రంలో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ హీరోయిన్ గా “తేజస్వి మదివాడ” ఎంపికయ్యారు.

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్యపాత్రలలో ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు, భయంతో కూడిన వినోదాన్ని పంచే “సర్కస్ కార్-2ష క‌థ అని తెలుస్తోంది.

ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ… “నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన “సర్కస్ కార్” చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. “సర్కస్ కార్-2″లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతశివరాజ్ గారికి థాంక్స్” అన్నారు.

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ… “సర్కస్ కార్” సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారని అన్నారు.

.

Related posts