షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, ఆర్యన్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
2021 అక్టోబర్ 2న ముంబయి నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి షారుక్ తనయుడు ఆర్యన్‌తోపాటు మరికొందరు హాజరయ్యారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం అందుకున్న నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. దాదాపు 22 రోజులు ముంబైలోని ఆర్థర్ జైలులో శిక్ష అనుభవించాడు ఆర్యన్ ఖాన్. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
తాజాగా ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరో 14 మందిని నిందితులుగా పేర్కొంది.