అనుపమ పరమేశ్వరన్…. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ వెంటనే శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందింది. అయితే ఈ మలయాళ బ్యూటీకి మన తెలుగు మాట్లాడటం వచ్చు కానీ.. రాయడం రాదు. దాంతో అ.. ఆ.. లు నేర్చుకుంటూ తెలుగు రాయడం మొదలెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి, కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే మొదలెట్టానని తెలిపింది. అయితే కేరళ నుండి వచ్చిన అనుపమ మన భాష పై మక్కువతో దానిని రాయడం నేర్చుకుంటుంది కానీ.. మన తెలుగు రాష్ట్రాలలో చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు మాట్లాడటం తప్ప… రాయడం రాదు. మరి ఇప్పుడు అనుపమను చూసైనా మన హీరోలు నేర్చుకుంటారా… లేదా అనేది చూడాలి. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం హీరో నిఖిల్ సరసన ’18పేజీస్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటే తమిళ, మలయాళంలోనూ పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలు ఎలా ఉండనున్నాయి అనేది.
previous post
next post