telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సమంతతో అల్లు అర్జున్…?

ఓటీటీ ప్లాట్‌ ఫాం ‘ఆహా’తో కలిసి స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత సరికొత్త సెలబ్రిటీ ‘సామ్ జామ్’ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత టాలీవుడ్ స్టార్ హీరోతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ‘సామ్ జామ్’ షోలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇంతకుముందే తన ఎపిసోడ్లలో ఒకటి ఖచ్చితంగా అల్లు అర్జున్ కనిపిస్తాడని సమంత గ్రాండ్ లాంచ్ లో చెప్పింది. తాజాగా అల్లు అర్జున్ ప్రత్యేక ఎపిసోడ్ ‘సామ్ జామ్’ షూటింగ్ కోసం స్టూడియోకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దింతో సమంత-అల్లు అర్జున్ కాంబినేషన్ కోసం బన్నీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న పుష్పతో బిజీగా ఉన్నాడు. దాని నుండి కొంత విరామం తీసుకొని, మెగా ప్రిన్సెస్ నిహారికా వెడ్డింగ్‌ కి హాజరు అయ్యాడు. తాజాగా బన్నీ, సమంతా అక్కినేనితో ‘సామ్ జామ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది.

Related posts