telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సోమారపు పార్టీనీ వీడటం వల్ల నష్టమేమీ లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్

MLA Balka Suman praises Padmarao

టీఆర్ఎస్ పార్టీనీ సోమారపు సత్యనారాయణ వీడటం వల్ల పార్టీకీ వచ్చిన నష్టమేమీ లేదని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమారపు సత్యనారాయణ చేసిన ఆరోపణలను బాల్క సుమన్ ఖండించారు. సొంత పార్టీ నేతలను ఓడించాలని చూసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో తన గెలుపు కోసమే తాను కష్టపడ్డాను తప్ప వేరే వాళ్ల ఓటమికి తాను ప్రయత్నించలేదని అన్నారు.

సోమారపు రాజకీయాలు ఏంటో రామగుండం ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన సముచిత స్థానం కల్పించామని అన్నారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Related posts