telugu navyamedia
తెలంగాణ వార్తలు

తల్లీకొడుకు ఆత్మహత్య కేసు: మున్సిపల్‌ చైర్మన్ జితేంద‌ర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

*కామారెడ్డి రామాయం పేట‌లో ఆందోళ‌న‌
*మున్సిప‌ల్ చైర్మ‌న్ జితేంద‌ర్ ఇంటి ఎదుట ధ‌ర్నా
*ఆందోళ‌న‌కారులను చెద‌ర‌గొట్టిన పోలీసులు.. వాగ్వాదం..
*బాధిత కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించిన ఎస్పీ..
*నిందితులంద‌రిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశాం..
*ప్ర‌త్యేక‌టీం ఏర్పాటు చేశాం..

కామారెడ్డి లోని న్యూమహరాజా లాడ్జీలో సజీవదహనమైన తల్లీ, కొడుకు ఘటన రామాయంపేటలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకొడుకు అంతిమయాత్ర సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక మున్సిపల్ చైర్మెన్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ జితేందర్‌గౌడ్‌ ఇంట్లోకి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. మున్సిపల్‌ ఛైర్మన్ జితేందర్‌గౌడ్‌ ఇంటికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమ వారి చావులకు కారకులైన ఏడుగుర్ని అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష విధించే వరకూ వెళ్లమని నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు స్థానికులు అండగా నిలవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Thumbnail image

మ‌రోవైపు జిల్లా ఎస్పీ రోహిణి రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. ఏడుగురు నిందితులైన మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌, సీఐ నాగార్జున గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాదగిరి సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు  స్పష్టం చేశారు. 

ఇద్దరి మృతి దేహాలను మార్కెట్ కమిటీ చైర్మన్ జితేందర్ గౌడ్ ఇంటొనుంచి తీసుకొని ని అంతిమయాత్రకు బయల్దేరారు. ప్రస్తుతానికి వాతావరణం శాంతించినట్లుగా ఉన్నప్పటికి పోలీసు బలగాలు మాత్రం భారీగా మోహరించారు.

Related posts