telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ పల్లెలన్నీ బాగుండాలి: సీఎం కేసీఆర్

Kcr telangana cm

తెలంగాణలో పల్లెలన్నీ బాగుండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశంలో వ్యవసాయ రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులకు అవసమరమైన ప్రణాళిక రచించాలని స్పష్టం చేశారు.ఈ ఏడాది రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

రెండు నెలల్లోగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లోగా రైతు వేదికలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నాలుగేళ్లలో గ్రామాల్లో పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పనుల తాలూకు వివరాలు డిస్ట్రిక్డ్ కార్డులు రూపొందించాలని అన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందేనని అన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని అన్నారు.

Related posts