దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఆయా షాపుల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు అలాగే కొనసాగనున్నాయి.
జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద..రెగ్యులేటర్ కేసీఆర్ వద్ద: నారా లోకేశ్