మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.తనతో పాటు హోమ్ మంత్రిగా మహమూద్ అలీని కూడ ప్రమాణం చేయించారు. మంగళవారం నాడు కేసీఆర్ కేబినెట్‌లో మంగళవారం నాడు 10 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ జాబితాలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావులకు చోటు కల్పించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున హరీష్‌రావు పేరు కేబినెట్‌లో లేదని పైకి చెబుతున్నారు.
గతంలో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మాత్రమే కేసీఆర్ ఈ సారి కేబినెట్‌లో చోటు కల్పించారు. కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్ కు చోటు దక్కితే హరీష్ రావుకు కూడ చోటు కల్పించనున్నారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ బాధ్యతలను అప్పగించారు. కానీ, హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి పదవులు లేవు. ఇవాళ కేబినెట్‌లో కూడ హరీష్‌కు చోటు లేకుండా పోయింది.
ఈ రోజు పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే మరో ఆరుగురికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది. ఆ సమయంలో హరీష్ రావుకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్‌రావును ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం కూడ ఉంది. అయితే ఈ విషయమై ఏదీ స్పష్టత రాలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిపే విస్తరణలో హరీష్, కేటీఆర్‌లకు తప్పకుండా మంత్రివర్గంలో బెర్తులు దక్కే అవకాశం ఉందంటున్నారు.
మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు