బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ యువకుడు. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71,72,73 ప్లాట్ నంబర్ 35 పార్ట్, 36 పార్ట్ స్థలంలో తన బంధువు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఇంటిని జెసిబితో నేలమట్టం చేశారని శివకిశోర్ అనే యువకుడు తెలిపాడు. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నరని ప్రశ్నిస్తే నువ్వేవడు రా అని పౌరుష పదజాలంతో దూషించి వర్కల శివకిశోర్ గౌడ్ పైన 7 మంది వ్యక్తుల రాళ్లతో దాడి చేసినట్లు ఆ యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి వీడిపై రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువకుడి ఇచ్చిన వివరాలతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చెప్పటారు. మేయర్ పై కేసు నమోదుకావడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది. దాంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.
next post