శాసన సభ ఎన్నికనేపథ్యంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, ప్రింట్ , ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో విడియో డిస్ ప్లే , సినిమా థియేటర్లు. రేడియో ఛానల్ లో బల్కు ఎస్ఎంఎస్ సెబ్ సైట్ లో లప్రసారం చేసే వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్‌లతో పాటుగా వాల్ రైటింగ్ డిస్ప్లే వాహనాలు ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంనుండిఅనుమతి పొందాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రో స్ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి, తీసుకోవాల్సి ఉంటుందన్నారు.వివిధ వార్త పత్రికలు,ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపుకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి)ని జి హెచ్ ఏం సి ప్రధాన కార్యాలయంలో సి పి అర్ ఓ సెక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఇన్‌ఫర్మేషన్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓ లను ఈ కమిటీలో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను నియమించినట్టు రోనాల్డ్ రో స్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా మీడియా అతిక్రమణలు జరిగితే ఈ కమిటి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో, శాటిలైట్ ఛానెల్స్, లోకల్ కేబుల్ నెట్ వర్క్స్ లో ప్రసారమయ్యే అన్నిరకాల రాజకీయ ప్రకటనలను ఎంసిఎంసి కమిటి చే ముందస్తుగా అనుమతి పొందాలని, అదేవిధంగా పోలింగ్ రోజు, ముందురోజు ప్రచురితం అయ్యే ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాఇతర మాధ్యమాలలో ప్రకటనలను కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి మతాలు, వర్గాలపై దాడి, దుర్బాషలు, అనుచిత వాఖ్యలు లేకుండా ఉండడం, హింసను ప్రేరేపించడం, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉండడం, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండడం, దేశ సార్వభౌమత్వం ఐక్యతకు భంగం కలిగించేలా ఉండడం, వ్యక్తిగత దూషణలు లేకుండా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాజకీయ ప్రకటనలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రింటింగ్ ప్రెస్ వారు కూడా అనుమతి తీసుకోవాలి అన్నారు. ప్రింటింగ్ చేసే పోస్టర్లు, కర పత్రాలలో ఎలాంటి విలేకుండా ఉండాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటిచేసే అభ్యర్థులకు మాత్రమే హైదరాబాద్ జిల్లా ఎంసిఎంసి కమిటీ చే రాజకీయ ప్రకటనలకు అనుమతి జారీచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్ట్రార్ అయిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎంసిఎంసి కమిటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.
పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా
ఏదైన పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా చానల్‌లో వచ్చే వార్తలు,సోషల్ మీడియా విశ్లేషణలకు డబ్బులు చెల్లించడం లేదా ప్రలోభాలకు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పెయిడ్ న్యూస్‌గా ఎంసిఎంసి కమిటీ గుర్తిస్తుంది. పలు పార్టీలు, అభ్యర్థులు మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యక్తిగత ప్రచారాలకు సంబంధించి పెయిడ్ న్యూస్‌లు ఇటీవల కాలంలో ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించింది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఈ పెయిడ్ న్యూస్‌లను అరికట్టడానికి ప్రత్యేకంగా పెయిడ్ న్యూస్ నియంత్రణ వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మీడియా మానిటరింగ్, సర్టిఫికేషన్ కమిటి పెయిడ్ న్యూస్‌లను గుర్తించి రిటర్నింగ్ అధికారుల ద్వారా సంబంధిత అభ్యర్థికి నోటీసులు జారీచేస్తుంది. ఈ పెయిడ్ న్యూస్‌కు సంబంధించి సమాచార శాఖ అందించిన రేట్ కార్డును అనుసరించి వాటికి అయ్యే వ్యయాన్ని లెక్కించి అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో జమ చేయడానికిగాను ఆర్.ఓ ద్వారా నోటీసులు జారీచేస్తారు. ఈ నోటీసు ప్రతిని ఎన్నికల వ్యయ పరిశీలకులకు కూడా అందజేస్తారు. పత్రికల్లో లేదా టి.వి ఛానళ్లలో ప్రసారమైన పెయిడ్ న్యూస్ వ్యయాన్నితమ ఎన్నికల వ్యయంలో ఎందుకు కలపరాదో కోరుతూ 96 గంటల్లోగా సంబంధిత అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీచేస్తారు. పెయిడ్ న్యూస్‌పై రిటర్నింగ్ అధికారి జారీచేసిన నోటీసులకు సంబంధిత అభ్యర్థులు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల సమాధానానికి ఎంసిఎంసి కమిటి సంతృప్తి చెందనట్లైతే అట్టి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపుతారు. అయితే ఎంసిఎంసి నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయి ఎంసిఎంసి కమిటి రెఫర్ చేసే అవకాశం అభ్యర్థికి ఉంటుందన్నారు.
అన్ని న్యూస్ ఛానెళ్ల ప్రసారాల రికార్డింగ్
వివిధ వార్తా ఛానెళ్లలో వచ్చే వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలియచేశారు. అన్ని ప్రధాన ఛానళ్లు హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిచే ప్రచారాలకు సంబంధించి రికార్డింగ్ చేపట్టామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రో స్ వెల్లడించారు.