telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

వీడియో చూస్తూ ప్రసవం చేసిన ప్రియుడు..తల్లి క్షేమం బిడ్డ మృతి!

youtube logo

గర్భం దాల్చిన తన ప్రియురాలికి యూ ట్యూబ్ లో వీడియోలు చూస్తూ ప్రసవం చేసే ప్రయత్నం చేశాడో ప్రియుడు. ఈ క్రమంలో బిడ్డ మృతి చెందగా తల్లి క్షేమంగా బయటపడింది. తమిళనాడులోని గుమ్మిండింపూండిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సౌందర్ (27) అనే యువకుడు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు. ఓ కాలేజీ విద్యార్థిని అతనికి పరిచయం కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లోబరచుకున్నాడు.

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఎనిమిది నెలలు నిండిన తరువాత, ఆమెకు నొప్పులు ప్రారంభం కాగా, సౌందర్ కు విషయం చెప్పింది. దీంతో వెంటనే అడవిలోకి బైక్ పై తీసుకెళ్లాడు. ఓ చెట్టు కింద పడుకోబెట్టి వీడియోలు చూస్తూ ప్రసవం చేసే ప్రయత్నం చేశాడు. బ్లేడుతో కోయడంతో గర్భంలోనే శిశువు పేగులు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేసి, గర్భంలోని మగశిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.

Related posts