telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

అన్‌లాక్ 4 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కార్

cm jagan ycp

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కార్ జారీ చేసింది. ఆ మేరకు విద్యా సంస్థలు ఈ నెల 30 వరకు బంద్ కొనసాగనుంది. సెప్టెంబర్ 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరిగా ప్రభుత్వం పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లకు 21 నుండి అనుమతి ఇవ్వునుంది. అలాగే పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే  అంతక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Related posts