ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ తన పాలనపై పట్టు పెంచుకునేందుకు సీఎంవో అధికారులపై బదిలీ వేటు వేశారు. చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారులను బదిలీ చేశారు. సీఎంవో కార్యాలయంలో చాలా కాలంగా పని చేస్తున్న ఉన్నతాధికారులందరిపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు.
ఇందులో ప్రధానంగా సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ చంద్రతోపాటు ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి గిరిజా శంకర్‌తోపాటు అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు. వారిని సాధారణ పరిపాలనకు రిపోర్టు చేయాల్సిందిగా సీఎస్ ఆదేసించారు.