telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానాశ్రయంలో 200 తేళ్లతో పట్టుబడ్డ ప్రయాణికుడు… తేళ్లు ఎందుకంటే ?

Air passenger tried to smuggle 200 live scorpions out of Sri Lanka in his luggage

శ్రీలంకలోని బండరనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం చైనాకు చెందిన ఓ ప్రయాణికుడిని అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు విషపూరితమైన 200 తేళ్లు పట్టుబడ్డాయి. దాంతో వెంటనే సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, విచారించిన అధికారులు.. భారీ జరిమానా విధించి తిరిగి చైనాకు పంపించారు. సోదాల్లో ప్రయాణికుడి లగేజీ నుంచి భారీ మొత్తంలో ప్లాస్టిక్ బాక్సులు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని తెరిచి చూశారు. వాటిలో బతికి ఉన్న విషపూరితమైన 200 తేళ్లు కనిపించడంతో షాకయ్యారు. దాంతో కస్టమ్స్ అధికారులు తేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చైనీయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం సదరు వ్యక్తికి రూ. లక్ష జరిమానా విధించి… తిరిగి చైనాకు పంపించారు. కాగా, ఈ తేళ్లను అతడు భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

Related posts