telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈనెల 21న బీజేపీలో చేరడం లేదు..హామీ ఇస్తే..

*ఈనెల 21న బీజేపీలో చేరడం లేదు
*మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు
*బీజేపీ నేతల ముందు ప్రతిపాదనలు పెట్టిన సినీనటి జయసుధ
*అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమన్న జయసుధ
*ఢిల్లీ పెద్దలుతో మాట్లాడి హామీ ఇస్తే పార్టీలో చేరతాను
*ఈనెల 21 బీజేపీలో చేరతారనే వార్తలపై స్పందించిన జయసుధ

ప్రముఖ సీనియర్ సినీ నటి, రాయకీయ నాయకురాలు జయసుధ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధంచేసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె విజయం సాధించారు.  సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2016 జనవరి 17న ఆమె కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. :ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ బలోపేతం కోసం తాను ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు.

Jayasudha Joins TDP- The New Indian Express

2019లో జయసుధ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పటికీ జయసుధ  ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడం లేదు. రాజకీయ కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు.ఈ క్ర‌మంలోబీజేపీలో చేరాలని జయసుధతో బీజేపీ నేతలు కొంతమంది ఆమెతో చర్చించినట్లు సమాచారం.

Telugu actress Jayasudha joins YSR Congress

21న మునుగోడులో జరిగే బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జయసుధ ఆ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించిన జయసుధ.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.

ఈ నెల 21 బీజేనీ లో చేరడం లేదని జ‌య‌సుథ‌ స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలను కోవడం లేదని తెలిపారు. అయితే బీజేపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు ఉంచిన‌ట్లు జయసుధ వెల్లడించారు. తన ప్రతిపాదనలు అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి హామీ ఇస్తే పార్టీలో చేరుతాన‌ని జయసుధ పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె విజయం సాధించారు.  సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 
2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2016 జనవరి 17న ఆమె కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. :ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ బలోపేతం కోసం తాను ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. 2019లో జయసుధ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పటికీ జయసుధ  ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడం లేదు. రాజకీయ కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు.

Related posts