telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ వాసులకు కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌…

స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు చేపడుతున్నది. ఇంటింటి చెత్త సేకరణ కోసం 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు 300 స్వచ్ఛ ఆటో టిప్పర్లను మంత్రి శ్రీ కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2,500 స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరో 650 కొత్త స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో ఇవాళ 300 ఆటోలను నగరంలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

Related posts