telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే… నటుడు గోవిందా సంచలన వ్యాఖ్యలు

Govinda

సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సల్మాన్ ఖాన్‌తో పాటు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలి వంటి పలువురిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ హీరో గోవిందా బాలీవుడ్‌లో బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గోవిందా. తన సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉండటం కారణంగానే టాలెంట్ ఉన్న ఎంతో మంది నటులు రాణించలేక పోతున్నారు. నెపోటిజం కారణంగా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారని అన్నారు. తన తల్లిదండ్రులు నిర్మలాదేవి, అరుణ్ కుమార్ లు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అయినప్పటికీ తనకు మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Related posts