ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ”టీఆర్ఎస్‌కు మద్దతు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వరకే పరిమితం. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తాం. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం.
గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మాతో టచ్‌లో లేదు. మేం టీఆర్ఎస్ దగ్గరకు పోలేదు.. టీఆర్ఎస్సే మా మద్దతు కోరింది. మున్సిపల్ ఎన్నికల పొత్తు అంశం చర్చకు రాలేదు” అని చాడ అన్నారు.