telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర రాజకీయం మలుపులు ..శరద్‌ పవార్‌తో సంజయ్‌ రౌత్‌ భేటీ!

Loksabha Elections MP Contest Sharad pawar

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాసనసభ ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి సుమారు రెండు వారాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడడం లేదు. ఈ నెల 9వ తేదీన ఆ రాష్ట్ర శాసనసభ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో. 50-50 ఫార్మూలా విషయంలో శివసేన – బీజేపీ మధ్య సంధిగ్ధత నెలకొంది.

అయితే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను శివసేన సీనియర్‌ నాయకులు సంజయ్‌ రౌత్‌ ఇవాళ ఉదయం కలిశారు. పవార్‌తో సమావేశం ముగిసిన అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ శరద్‌ పవార్‌ సీనియర్‌ నాయకులు. మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పవార్‌ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శరద్‌ పవార్‌తో తాను చర్చించినట్లు సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

Related posts