telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”లో నటిస్తున్న వర్మ… పాత్ర ఏంటంటే ?

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇప్పటికే ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన వ‌ర్మ ఇటీవల కేఏపాల్‌పై స్పెష‌ల్ వీడియో రూపొందించి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. తాజాగా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో తాను కూడా నటిస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కొత్త నటుడు’ అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకుని గోళ్లు కొరుక్కుంటున్నట్టుగా వర్మ స్టిల్ ఉంది. అయితే, ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏ క్యారెక్టర్ చేస్తున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో తొలిసారి వెండి తెరమీద కనిపించనున్నాడు. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన నటి శ్రీరెడ్డి కూడా ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తోంది.

Related posts