telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులు రావు : వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల సమీక్ష సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమావేశం సాక్షిగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత సర్పంచ్ దేనని హుకుం జారీ చేశారు. అంతేకాక ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులివ్వమని బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీటీసీలు గెలవని పంచాయతీలలో అభివృద్ధికి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు సహాయసహకారాలు అందవని హెచ్చరించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ లు, అభ్యర్థులు అవాక్కయ్యారు. మరోపక్క ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ జిల్లాకి ఇద్దరు పరిశీలకులు ఉన్త్రైన్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి ఉంటారని పేర్కొన్నారు.

Related posts