telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్రిస్మస్ కంటే ముందుగానే వ్యాక్సిన్…

corona vaccine

ప్రపంచాన్ని మొత్తం కరోనా గజగజ వణికిస్తోంది. అన్నిటికంటే ఎక్కువగా కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తున్నది.  పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఎప్పటి వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందో చెప్పలేని పరిస్థితి.   ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని అంతా అనుకున్నారు.  అయితే, ఫైజర్ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.  ఫైజర్ టీకా 95 శాతం ఫలితాలు ఇస్తున్నట్టు అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఫాసి పేర్కొన్న సంగతి తెలిసిందే.  అత్యవసర వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు చేసుకుంది.  అనుమతులు వచ్చిన వెంటనే టీకాను తయారు చేస్తామని, క్రిస్మస్ కంటే ముందే టీకా వచ్చే అవకాశం ఉన్నట్టు బయో ఎన్ టెక్ సీఈవో ఉగర్ సహీన్ తెలియజేశారు.  ఈ ఏడాది చివరి వరకు 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేస్తామని బయోఎన్ టెక్ తెలిపింది.  2021 నాటికి 13 కోట్ల డోసులు తయారు చేస్తామని, టీకా పంపిణి కోసం బ్రెజిల్, జర్మనీ, జపాన్, యూరోపియన్ యూనియన్ లతో ఒప్పందాలు చేసుకున్నట్టు బయో ఎన్ టెక్ తెలియజేసింది. చూడాలి మరి ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా… అనేది.

Related posts