వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ట్విటర్ లో విరుచుకుపడ్డారు. నిరంకుశ వైసీపీ పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వివిధ వర్గాల ప్రజల రాష్ట్రంగా ఉండేదని పేర్కొన్నారు. అన్ని మత విశ్వాసాలు వికాసం పొందాయని తెలిపారు.
శాంతియుతంగా కలసిమెలసి ఉండే పరిస్థితి రాష్ట్రంలోవ ఉండేదని చంద్రబాబు వివరించారు. కానీ నిరంకుశ వైసీపీ పాలన మొదలయ్యాక తమ మత విశ్వాసాలపై వరుసగా జరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన దాడులకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.
ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా