telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుండెపోటుతో కమెడియన్ రాక్‌లైన్ సుధాకర్ మృతి

Rockline Sudhakar

కన్నడ నటుడు, కమెడియన్ రాక్‌లైన్ సుధాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూసినట్లు కన్నడ సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే రాక్‌లైన్ సుధాకర్‌ కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఎంతో చురుకుగా ఉన్న సుధాకర్ గుండెపోటుతో మరణించడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ నటులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 120కి పైగా చిత్రాల్లో రాక్ లైన్ సుధాకర్ నటించారు. తన విలక్షణమైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Related posts