telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నారన్న కారణంతో షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహంతో వైఎస్ షర్మిల ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో లోటస్ పాండ్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొనడంతో షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

“నన్నేందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నేను బయటకు రాకుండా ఇంత మంది ఎందుకు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. నేను పర్సనల్ పని మీద కూడా బయటికి వెళ్లకూడదా. నేను సిట్ ఆఫీస్‌కు పోతా.. అపోలో హాస్పిటల్‌కు పోతా.. చర్చికి పోతా.. ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకు లేదా.. మీకు ఏం పని లేదా.. ఏం పని పని లేకపోతే గాడిదలను కాసుకోండి పోయి..” అంటూ అక్కడే ఉన్న పోలీసుల మీదికి అంతెత్తున లేచారు. అయితే.. ఆమె మాటలన్ని విన్న కానిస్టేబుల్.. గాడిదలు కాసుకోండి పోయి… అన్న వెంటనే.. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా.. “అదే చేస్తున్నాం మేడం” అంటూ కౌంటర్ వేశారు.  తన రక్షణ కోసం డిఫెన్స్ చేసుకుంటే తప్పా? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.

Related posts