నేటి ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ(47), క్వింటన్ డికాక్ (81) మొదటి నుంచీ దూకుడుగా ఆడారు. దీనితో వీరిద్దరూ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు.
రోహిత్ ఔటయ్యాక క్వింటన్ అర్ధశతకం సాధించాడు. తర్వాత సూర్యకుమార్(16), కీరణ్‌పోలార్డ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే డికాక్, హార్దిక్ పాండ్య నిలకడగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు నడిపించారు. చివర్లో డికాక్, ఇషాన్ కిషన్(5) ఔటైనా హార్దిక్ పాండ్య (28, 11 బంతుల్లో 1×4, 3×6) బౌండరీలతో చెలరేగి రాజస్థాన్ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.