telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మాకు రిటైర్మెంట్ బాధే లేదు.. : పాక్ మాజీ కెప్టెన్ వకార్‌ యూనిస్‌

pak ex captain on present team

పాక్ ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ఆఖరి నిమిషం వరకూ తేలలేదు. ఎవరు ఆడతారో ఎవరు ఆడరో అనే విషయాలపై స్పష్టతలేదు. సీనియర్‌ ఆటగాళ్లు ఇంకా తమ కెరీర్‌ను కొనసాగించాలనుకోవడం పెద్ద సమస్యగా మారింది. గౌరవప్రదంగా రిటైరవ్వాలని ఆ క్రికెటర్లకు చెప్పేవాళ్లు లేరు. ప్రపంచకప్‌లో విఫలమవుతామనే భయంతో పీసీబీ అధికారులు ఆఖరి నిమిషంలో సీనియర్‌ ఆటగాళ్లని ఎంపిక చేశారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది అని పాక్ మాజీ కెప్టెన్ వకార్‌ యూనిస్‌ చెప్పుకొచ్చారు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో గెలవడానికి పాక్‌ జట్టు ఎంత కష్టపడిందో మనకు తెలుసు. భవిష్యత్‌లో అలా జరగకూడదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, సీనియారిటి విషయాల్లో పీసీబీ రాజీపడటం పెద్ద తలనొప్పిగా మారింది అన్నారు.

ప్రతీ ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్‌, కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్ల మార్పులు చేయడమే సరిపోతుంది. వాటివల్ల ఎలాంటి ఫలితం ఉండట్లేదు. సరైన సమయంలో సీనియర్లు రిటైరవ్వాలని నేను ఇదివరకే చెప్పాను. అయినా నా మాట ఎవరూ వినలేదు.. అని పేర్కొన్నాడు. కాగా తనకు ప్రధాన కోచ్‌ బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, ఒకవేళ నిజంగా పీసీబీ అధికారులు అలాంటి అవకాశమొస్తే తప్పకుండా జట్టు కోసం తన సేవలందిస్తానని వకార్‌ చెప్పాడు. అలాగే ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై ఆటగాళ్లను దూషించడాన్ని తప్పుబట్టాడు.వ్యక్తిగతంగా దూషణలు చేయొద్దని.. విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని మాజీ కెప్టెన్‌ వివరించాడు.

Related posts