telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డ ను తొలగిస్తేనే రాజ్యాంగ పదవిపై గౌరవం పెరుగుతుంది…

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చంద్రబాబు ఆరోపనలను తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం పోవడానికి వీలు లేదనే ఉచిత ఇసుక అమలు చేయలేదు అని తెలిపారు. అందరికీ అందించేందుకే  తక్కువ ధరకు ఇసుకను సీఎం అందిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు రీచ్ పక్కన   8వేలు ఇసుక ఎక్కడా లేదు అన్నారు.  శేఖర్ రెడ్డికి ఇసుక కట్టబెట్టాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పిన ఆయన పేదల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అన్నారు. ఇక నిమ్నగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో.. చంద్రబాబు చేతిలో ఉన్నారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై మాకు గౌరవం ఉంది. దొంగలను తీసుకువచ్చి చంద్రబాబు రాజ్యాంగ బద్ద పదవిలో కూర్చో బెట్టారు. ఎవరిని అడిగి  నిమ్మగడ్డ రమేష్ గతంలో స్థానిక ఎన్నికలను ఆపారు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేేతతో మాట్లాడి  ఇప్పుడు ఎన్నికలను జరుపుతారా…  కుక్కను తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కాబట్టి  నిమ్మగడ్డ రమేష్ ను వెంటనే పదవినుంచి తొలగించాలి. నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తేనే రాజ్యాంగ పదవిపై గౌరవం పెరుగుతుంది అని సూచించారు మంత్రి కొడాలి నాని.

Related posts