తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కేసీఆర్ కు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రాన్ని ఏపీ సీఎం జగన్ అందజేశారు. కేసీఆర్ తన కుటుంబంతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్ వెంట ఉన్నారు.
కాగా, హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కేసీఆర్, జగన్ ల భేటీ కొనసాగుతోంది. గోదావరి జలాలు, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజకీయ అంశాల గురించీ వారు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత ఈ రాత్రికి లోటస్‌పాండ్‌లోనే సీఎం వైఎస్ జగన్ బస చేయనున్నారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
జైలులో చిప్ప కూడు తినే వాళ్ళకు సీఎం పదవి..