telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ ఒక్క ప్లేట్ ఆహారం తింటే.. లక్ష బహుమతి.. ప్లేట్ పెద్దదే మరి..

eat plate food win 1 lak price challenge

రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో జయప్రకాశ్ నారాయణ బ్రహ్మానందానికి ఇచ్చిన ఫుడ్ పార్టీ అందరికి గుర్తుంటుంది. అందులో బ్రహ్మానందానికి పెద్ద కంచం నిండా ఫుడ్ పెట్టి తినమని ఆర్డర్ వేస్తాడు జయప్రకాశ్. అందుకు బ్రహ్మి.. ‘ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు.. మనిషన్న వాడు ఎవడైనా ఇంత ఫుడ్ తింటాడా.. అంటూ అడుగుతాడు. అయినా ఆ మాటలు వినకుండా మొత్తం తినిపిస్తాడు.. ఇంకేముంది కట్ చేస్తే బ్రహ్మానందం హాస్పిటల్ పాలవుతాడు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీన్‌ను గుజరాత్‌లోని ఓ రెస్టారెంట్ రిపీట్ చేస్తోంది.

సూరత్‌కు చెందిన సదరు రెస్టారెంట్ బకాసుర థాలి పేరుతో సరికొత్త స్కీంను ఏర్పాటు చేసింది. ఇందులో 55 రకాల వంటకాలు, 12 రకాల స్వీట్లు, 7 రకాల సలాడ్లు, 15 రకాల రోటీలను వడ్డిస్తారు. ఇక వచ్చే కస్టమర్ వీటిని మిగల్చకుండా తింటే లక్ష రూపాయల గిఫ్ట్ ఇస్తారు. ఒకవేళ ఆ థాలిని పూర్తి చేయకపోతే మాత్రం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో పాల్గొనేందుకు సూరత్ వాసులు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన ఫుడ్ పోటీ ఒకటి మంగళూరు రెస్టారెంట్ కూడా ప్రారంభించింది. 56 రకాల వంటలతో, 10 రకాల డెసర్ట్‌లు, 4 డ్రింక్‌లు, 4 రకాల చట్నీలు, 5 రకాల చిత్రాన్నాలు, రోటీలు, పచ్చళ్ళు, 8 రకాల కూరలు వడ్డిస్తారు. కస్టమర్లను ఆకర్షించడం కోసం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీల రెస్టారెంట్లలో ఈ థాలీలను ఏర్పాటు చేస్తున్నారు.

Related posts