telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఉడుపిలో నూతన్ నాయుడు అరెస్ట్…అనకాపల్లి సబ్ జైలుకు తరలింపు

Nuthan Naidu

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్ట అయిన బిగ్‌బాస్‌ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్‌నాయుడిని పోలీసులు అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అక్కడి నుంచి శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు.

ఉడిపి నుంచి అర్ధరాత్రి విశాఖపట్టణానికి తీసుకొచ్చారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో నూతన్ నాయుడిని అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు.

Related posts