telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్పీడ్‌ పెంచిన దేవరకొండ బ్రదర్..

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ అని అందరికి తెలిసిందే. దొరసాని సినిమాతో ఆనంద్‌ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హీరో, హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవలే ఈ యంగ్‌ హీరో సెకండ్‌ సినిమా కూడా పట్టాలెక్కించాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ ను ఇటీవలే ఆవిష్కరించారు. ఈ చిత్రానికి వినోద్ అంతోజు దర్శకత్వం వహించారు. ఈ రాబోయే తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్ల మ్మ నటించారు. భవ్య క్రియేషన్స్ చే నిర్మించబడింది. ఈ ట్రైలర్‌ కు మంచి స్పందన కూడా వస్తోంది. ఇప్పటికే 11 మిలియన్‌ వ్యూస్‌ ను దాటింది ఈ ట్రైలర్‌. ఇదిలా ఉండగా ఈ కుర్ర హీరో మూడో సినిమాను కూడా దాదాపు పూర్తి చేశాడట. ఆనంద్‌ దేవరకొండ మూడో ప్రాజెక్ట్‌ ని అన్న విజయ్‌ దేవరకొండ నిర్మించాడని టాక్‌. తన నిర్మాణ సంస్థ కింగ్‌ ఆప్‌ ది ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారట.

Related posts