ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై సన్నాహక సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో ఓటర్లకు వివరిస్తాం అన్నారు.. మొదటి విడత పార్లమెంట్ స్థాయి సమావేశాలు.. 24న నాగర్ కర్నూల్, 25న మల్కాజ్‌గిరి, 26, 27తేదీల్లో చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహిస్తామన్నారు.. 28న అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు రేవంత్ రెడ్డి.. రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమావేశం ఉంటుందన్నారు.. ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్.. ఏడాదికి కోటి ఉద్యోగాలు అని మోడీ చేసిన మోసాన్ని పట్టభద్రులకు వివరిస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ నమోదు చేసిన లెక్కప్రకారం రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. వీళ్లలో 2 శాతం మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.. ఇక, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు.. నిరుద్యోగులకు భృతి ఇవ్వని కేసీఆర్‌కి కర్రుకాల్చి వాత పెట్టాలని.. అప్పుడే కేసీఆర్ కి ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయన్నారు.. ఇక, పీవీ కూతరు సురభి వాణిదేవిని పోటీలో పెట్టి… కాంగ్రెస్ ఓట్లు చీల్చాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని.. గడిచిన మూడు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మొదటి రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది.. ఇప్పుడు బీజేపీకి లబ్ది చేకూర్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. కేసీఆర్ కుట్రలను ఓటర్లు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్.
previous post
next post