హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడిని మంగళవారం తెలంగాణ నూతన గవర్నర్ గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఉత్సవ నిర్వాహకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. గవర్నర్‌కు శాలువ కప్పి సన్మానించారు. గణనాథుని దర్శన అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు భక్తులు కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. గవర్నర్ రాక సందర్భంగా 30 నిముషాలపాటు క్యూ లైన్ నిలిపివేశారు. గవర్నర్ రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు.
చంద్రబాబు సేవలు దేశానికి అవసరం: కనకమేడల