ఈరోజు ఐపీఎల్ 2021 లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే రాజస్తాన్ జట్టులో వారి స్టార్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. ఎందుకంటే.. గత సీజన్లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇక జోఫ్రా ఆర్చర్ లేకపోవడం రాజస్తాన్ రాయల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని ఆ జట్టు కొత్త డైరెక్టర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర స్పష్టం చేశాడు. తమ ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్ కింగ్స్‌ను నిలువరించగలమన్నాడు. ఆదివారం సంగక్కర పీటీఐతో మాట్లాడుతూ… ‘మేము ఒక్క విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆర్చర్ మాకు పెద్ద బలం. ఈసారి అతను అందుబాటులో లేకపోవడంతో గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. ఇక మా ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్ కింగ్స్‌ను నిలువరించగలం’ అని అన్నాడు. గత నెలలో భారత్‌తో సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ చేతికి గాయమైంది. దీనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావడంతో ఐపీఎల్ 2021లో ఆడటంపై స్పష్టత లేదు. ఈ టోర్నీ మధ్య నుంచి కలుస్తాడనకున్నా.. ఇప్పుడు అది కూడా సాధ్యపడేలా కనుబడటం లేదు. ఆర్చర్ స్థానాన్ని క్రిస్ మోరిస్‌తో పూడ్చాలని రాజస్తాన్ రాయల్స్ భావిస్తోంది.
previous post
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు