telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌ ప్రతిపాదన మళ్లీ తిరస్కరణ!

Ashok gehalot rajasthan

రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 31 అసెంబ్లీని సమావేశపరచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా మూడోసారి కూడా తిరస్కరించారు.

అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నదీ సరైన కారణం చెప్పేందుకు కేబినెట్ తిరస్కరించడం వల్లే ఈ ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్టు గవర్నర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పకుంటే 21 రోజుల నోటీసు కోరవచ్చని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు మళ్లీ ప్రతిపాదనలు పంవచ్చని సూచించారు.

Related posts