telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గోవా డీజీపీ ప్రణబ్ నందా .. మృతి..

goa dgp pranab nanda died

గోవా డీజీపీ ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1988వ సంత్సరంలో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు. కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు.

నందా చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి. నంద ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Related posts