telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్‌ అనుభవమే ఉపయోగపడింది : సునీల్

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత తొలిసారి భారత్-ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లో బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్ నితిన్ మీనన్.. మంచి నిర్ణయాలతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇండోర్‌కు చెందిన 37 ఏళ్ల నితిన్‌.. గతేడాది జూన్‌లోనే ఎలైట్‌ ప్యానెల్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ సీరిస్ లో తన 40 నిర్ణయాలను సవాలు చేస్తూ ఇరు జట్ల కెప్టెన్లు సమీక్ష కోరగా అందులో కేవలం 5 మాత్రమే నితిన్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక ఎల్బీల విషయంలో 35 సమీక్షలకు గాను రెండు మాత్రమే ప్రతికూలంగా వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్‌-14వ సీజన్‌కు సిద్ధమవుతున్న అతను చెన్నైలో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ సందర్బంగా అతను మాట్లాడుతూ… ‘గత రెండు నెలలు గొప్పగా గడిచాయి. మనం సమర్థంగా చేసిన పనిని ప్రజలు గుర్తించి, అభినందిస్తే గొప్ప సంతృప్తి కలుగుతుంది. వరుసగా మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తించడం నాకు కొత్తేమీ కాదు. దేశవాళీ, ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడింది. ఆటగాళ్లలాగే అంపైర్లూ ఫామ్‌లో ఉంటారు. నేను మంచి ఫామ్‌లో ఉన్నపుడు ఎలాంటి విరామం లేకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లకు పనిచేయాలని అనుకుంటా. అంపైర్‌గా నా పనిని ఆస్వాదిస్తుంటా” అని నితిన్ చెప్పుకొచ్చాడు

Related posts