telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పుష్పరాజు వచ్చేది అప్పుడే…?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్లు తప్ప మారె అప్డేట్ రాలేదు. అయితే త్వరలోనే ఈ సినిమా నుండి పుష్పరాజు ను ఈ నెల 7న సాయంత్రం 06:12 గంటలకు పరిచయం చేయనున్నట్లు ఓ చిన్న వీడియో విడుదల చేస్తూ ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అందుకే షూటింగ్ ను చాలా వేగంగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఎంతలా క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Related posts