పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయని చురకంటించారు. 28, 30 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి భారత పౌరసత్వం లేనందున ఇల్లు కట్టుకోలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు పట్టవని విమర్శించారు. వారికి కావాల్సిందల్లా రాజకీయమేనని దుయ్యబట్టారు.
జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి