telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వార్నర్‌ ను అందుకే తీసేసారా..?

డేవిడ్ వార్నర్‌‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ను సారథిగా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. తాజా సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌ నుంచి ఈ సీజన్‌ ముగిసే వరకు కేన్ మామనే కెప్టెన్‌గా ఉంటాడని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక హైదరాబాద్ అనూహ్య నిర్ణయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టుకు ఎంతో చేసిన డేవిడ్ వార్నర్‌ను ఇంతలా అవమానపరచడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై వేటు వేయడం వెనుక సన్‌రైజర్స్ పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చిన వార్నర్‌.. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌ల్లో193 పరుగులు చేయగా.. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ దూకుడుగా మాత్రం ఆడలేకపోయాడు. ఢిల్లీతో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి బంతులను వృథా చేసి, షార్ట్ రన్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఆ వెంటనే చెన్నైతో స్లో బ్యాటింగ్‌తో చికాకు తెప్పించాడు. ఈ తరహా ఆటతో వార్నర్ జట్టుకు భారంగా మారడని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Related posts