తెలంగాణలోని భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేవారు. కాని రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా రాములవారి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. భక్తులు లేకుండానే రాములవారి కల్యాణం జరగనుంది.
భద్రాద్రిలో జరగనున్న కల్యాణ వేడుకలకు 40 మందికి మాత్రమే అనుమతిఉంది. ప్రభుత్వం తరుఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అధికారులు ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి