telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగా లేదు: వెంగ్ సర్కార్

Vengsarkar

వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగాలేదని విమర్శించారు. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకునే రాయుడ్ని రెండేళ్లుగా ఆడించారని, తీరా ప్రపంచకప్ దగ్గరికి వచ్చేసరికి అతడ్ని పక్కన పెట్టారని వెంగీ మండిపడ్డారు. సెలక్టర్లు రాయుడి గురించి ఆలోచించి ఉంటే కచ్చితంగా ఎంపిక చేయాల్సిందన్నారు.

ఇప్పుడు అతడిపై పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహానే, పుజారా వంటి ఆటగాళ్లను బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకుని ఉంటే జట్టు ఎంతో బలంగా ఉండేదని చెప్పారు. అలాకాకుండా రిషబ్ పంత్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ లను బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకుంటే ఏంజరిగిందో చూశాం కదా అంటూ విమర్శించారు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన రహానే, పుజారాలకు అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుందని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

Related posts