telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీ షర్ట్‌ తో అసెంబ్లీలోకి ఎంట్రీ.. తర్వాత…?

గుజరాత్‌ అసెంబ్లీలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చుడాశమ టీ షర్ట్‌ వేసుకుని సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజాప్రతినిధిని టీ షర్ట్‌లో చూసిన స్పీకర్‌కి కోపం వచ్చింది. ఇది ప్లే గ్రౌండ్‌ కాదంటూ చురకలంటించారు. టీ షర్ట్‌తో సభకు రాకూడదంటూ ఆదేశించారు. వెంటనే నిష్క్రమించాలన్నారు. సభ్యుల డ్రెస్ హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని, సభకు వచ్చేటప్పుడు షర్టు లేదా కుర్తా ధరించి రావాలని ఆయన సూచించారు. 40 ఏళ్ల విమల్.. గతంలో కూడా ఇలావస్తే స్పీకర్ ఆయనను మందలించారు. అయినప్పటికీ విమల్‌ టీ షర్ట్‌తోనే రావడంతో రాజేంద్ర తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విమల్‌ మాత్రం తాను టీ షర్ట్‌లోనే వస్తానని చెప్పారు. తనను ఓటర్లు ఈ టీ షర్ట్ తోనే చూడడానికి ఇష్ట పడతారని, దీనితోనే తాను ఎన్నికల ప్రచారం చేసి గెలిచానని అన్నారు. దీనిపై మండిపడిన రాజేంద్ర తివారీ.. ఆయనను సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆయన కదలకపోవడంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ తీరుపై అభ్యంతరం చెప్పారు. సభ్యులు సభకు వచ్చినా తమ ఇష్టం వచ్చిన డ్రెస్ తో వస్తారని, ఇందులో తప్పేముందని వారు ప్రశ్నించారు.

Related posts